శ్రీ శ్రీ “మహాప్రస్థానం” పుస్తకంలో, నాకు నచ్చిన, నాకు అర్ధం అయ్యిన కొన్ని కవితలు, పద్యాలూ ఇంకా కావ్యాలు ఈ ఆర్టికల్ లో రాసాను.
శ్రీ శ్రీ గారు ఈ పుస్తకాన్ని తన మిత్రుడు అయిన కొంపల్లి జనార్దనరావు కి ఈ మహాప్రస్థానం అంకితం చేసారు.
శ్రీ శ్రీ గారు రాసిన ఏదైనా కవిత గాని, లేక పద్యం గాని, అది తానున్నపటి పరిస్థితులకి, రాబోయే తరం అంటే యువత, ఎలా మెలగాలో లేక ఎలా మనోస్థయిర్యాన్ని పొందాలో రాసిన పుస్తకమే ఈ “మహాప్రస్థానం“. అప్పటి కొన్ని వ్యవస్థలపైన శ్రీ శ్రీ గారికి ఉన్న భావోద్వేగాన్ని కవితల రూపంలో, పద్యాల రూపంలో వ్యక్తపరచిందే ఈ “మహాప్రస్థానం“
Mahaprasthanam Kavithalu in Telugu – తెలుగులో మహాప్రస్థానంలో కొన్ని కవితలు ఇంకా పద్యాలూ
- మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు
పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి! - ఎవుకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన,
సోమరులారా! చావండి! - నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చానూ!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు ఒక్కటి ధారపోశాను!
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను! - ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం! - పుడమి తల్లికి
పురిటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి! - కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియాక-
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వారడావస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం! - నే నొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం. - ఇవేమిటీ వింత భయాలు?
ఇంట్లో చీకటి!
ఇవేమిటీ అపస్వర్గాలు?
తెగింది తీగ!
అవేమిటా రంగుల నీడలు?
చావు, బ్రదుకూ!
ఎచటికి పోతా వీ రాత్రి?
అవతలి గట్టుకు! - పోనీ, పోనీ,
పొతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పొతే పోనీ!
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లు, రానీ!
రానీ, రానీ!
కానీ, కానీ!
గానం, ధాన్యం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ, పవీ! కవీ! - అలసిన కన్నులు కాంచేదేమిటీ?
తొణకిన స్వప్నం,
తొలగిన స్వర్గం!
చెదిరిన గుండెల నదిమే దేమిటి?
అవతల, ఇవతల
అరులై ఇరులే!
విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు?
దుర్హతి, దుర్గతి,
దుర్మతి, దుర్మృతి! - అందరం కలిసి చేసిన ఈ
అందమైన వస్తుసముదాయం అంతా
ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకు పోతూ ఉంటే చూచి,
“అన్యాయం, అన్యాయం?” అని మేమంటే –
“అనుభవించాలి మీ కర్మం” అంటడు. - ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది!
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం నిజం!
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖ, జగత్తులో!
బ్రతుకు వృధా, చదువు వృధా,
కవిత వృధా! వృధా, వృధా! - సిందూరం, రక్తచందనం,
బంధూకం , సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నాయన జ్వలిక,
కలకత్తా కాళిక నాలుక
కావాలోయ్ నవకవనానికి - ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం - పతితులారా!
భ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
ఇందులోని పద్యాలూ, కవితలు నాకు నచ్చిన మరియు నా బుర్రకి అర్ధం అయినవి మాత్రమే. ఈ పుస్తకాన్ని పైన ఉన్న లింకుని క్లిక్ చేస్తే కొనుక్కోవచ్చు.
Mahaprastanam Book Online Reviews
Comment the book reviews below!